17, ఆగస్టు 2015, సోమవారం

సలీం గారి అభినందన కార్యక్రమం

పాఠశాల రికార్డ్ అసిస్టెంట్ శ్రీ మహ్మద్ సలీం గారు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయి ఉత్తమ ఉద్యోగిగా కలెక్టర్ శ్రీదేవి గారు, జిల్లా మంత్రివర్యులు శ్రీజూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పాఠశాలలో వారికి అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమైనది.


శ్రీ సలీం గారిని సన్మానిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పరమేశ్వర రెడ్డి గారు, ఉపాధ్యాయ బృందం.

గ్రామజ్యోతి కార్యక్రమం

గ్రామజ్యోతి కార్యక్రమానికై ర్యాలీని ప్రారంభిస్తున్న ప్రత్యేకాధికారి శ్రీ మురళీకృష్ణ ఎం.ఈ.ఓ., గద్వాల గారు, ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పరమేశ్వర రెడ్డి గారు, విద్యాకమిటీ చైర్మెన్ గారు, గ్రామ సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు.

15, ఆగస్టు 2015, శనివారం

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

ప్రభాత భేరిలో విద్యార్థులు
పతాకావిష్కరణ చేసి ప్రసంగిస్తున్న ప్రధానోపాధ్యాయులు

14, ఆగస్టు 2015, శుక్రవారం

మొక్కలు నాటే కార్యక్రమం

మొక్కలు నాటే కార్యక్రమంలో గ్రీన్ కోర్ ఉపాధ్యాయులు శ్రీ ప్రకాశం గారు మరియు విద్యార్థులు 

శ్రీ భాస్కర్ గారి సన్మాన కార్యక్రమం

శ్రీ భాస్కర్ గారిని సన్మానిస్తున్న ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం

శ్రీ భాస్కర్ గారి బదిలీ సందర్భపు వీడ్కోలు సమావేశం

తెలుగు భాషోపాధ్యాయులు శ్రీ భాస్కర్ గారి బదిలీ సందర్భపు వీడ్కోలు సమావేశంలో ప్రసంగిస్తున్న పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ పరమేశ్వరరెడ్డి గారు. చిత్రంలో శ్రీ భాస్కర్ గారు, శ్రీవెంకటకృష్ణ గారు, శ్రీ జయప్రకాష్ గారు, శ్రీ పూదత్తు కృష్ణమోహన గారు. చి.రోహిత్.